మెగా పవర్ స్టార్ రాంచరణ్ , సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. చెర్రీ కెరీర్ లో 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా విజగ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే హైదరాబాద్, మారేడుమిల్లి లలో తరువాతి షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారని సమాచారం.
ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ పై నిర్మితమవుతున్న 50వ సినిమా కావడం విశేషం.కాగా, మొదట ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అయితే కథకు సంబంధించి షూటింగ్ పార్టు ఇంకా చాలానే మిగిలి ఉండడంతో, ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చారనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దిల్ రాజు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఓ బైలింగ్వల్ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రం తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతోంది. కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనకి దిల్ రాజు వచ్చారని చెబుతున్నారు. ఈ మూవీలో విజయ్ కి జోడీగా రష్మిక అలరిస్తుందనే సంగతి తెలిసిందే.