స్టాలిన్ తో భేటి .. ఆశించిన ఫలితాలు వచ్చాయి..!
స్టాలిన్ తో కేసీఆర్ ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. అలానే ఎప్పుటి నుంచో గుణాత్మాక రాజకీయాలంటూ బలపం కట్టుకుని తిరుగుతున్న కేసీఆర్ కు కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ తీసుకొచ్చి చక్రం తిప్పలన్న ఆశ ఈ నాటిది కాదు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం నాడు దక్షిణాది యవనికపై తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను రెపరెపలాడించాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది నుంచి బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఒకదానిని తయారు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటా బయట కేసీఆర్ యాక్టీవ్ పాలిటిక్స్ స్పీడ్ ను ఉన్నఫలంగా పెంచాడు. నిన్న చెన్నైలో స్టాలిన్ భేటీ ఆశించిన ఫలితాలు వచ్చినట్లు కేసీఆర్ అండ్ టీం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని కేసీఆర్ స్టాలిన్ కు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలంటే కలిసి పనిచేయాలన్న ఆలోచనలను కూడా కేసీఆర్ బలంగా వినిపించినట్లు సమాచారం. అసంతృప్తి వాదులను థర్డ్ ఫ్రంట్ వైపు తీసుకురావాలని కేసీఆర్ ఎత్తుగడగా ఉంటే.. మరో వైపు ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని స్టాలిన్ కూడా తరుచు మాట్లాడుతుంటారు. ఇలా ఇద్దరి వేవ్ లెంత్స్ మ్యాచ్ అవుతున్న నేపథ్యంలో కూటమిలో స్టాలిన్ భాగస్వామ్యం పక్కగా ఉంటుందంటూ కేసీఆర్ అండ్ కో భావిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ టూర్ కు రోడ్ మ్యాప్ సిద్ధం!
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీలో నెలకొన్న అంతరాన్ని పూడ్చడానికి ఆదివారం నుంచి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. 19న వనపర్తిలో ప్రారంభమై .. జనగాం, నాగూల్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ మొదటి దఫా షేడ్యూల్ ను పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది.
Must Read ;- ఏపీకి ఇక ముగ్గురు సీఎంలు..! మార్చడం ఆ దేవుడు తరం కూడా కాదు..!!











