మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీతో సినిమా చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే.. ఈ చిత్రానికి ముహుర్తం ఖరారు చేసారని సమాచారం. అయితే.. చిరంజీవి చేతికి ఇటీవల సర్జరీ జరిగింది. డాక్టర్లు ప్రస్తుతం రెస్ట్ తీసుకోమన్నారు. అందుకనే గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో చిరు చేయనున్న సినిమాల విషయంలో ఆలోచనలో పడ్డారని.. ఇప్పట్లో కొత్త సినిమాలను స్టార్ట్ చేసే ఆలోచన లేదని వార్తలు వచ్చాయి.
అయితే.. చిరంజీవి ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా.. కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం… డైరెక్టర్ బాబీతో చేయనున్న మూవీని నవంబర్ 6న చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇందులో చిరంజీవి పాత్ర ఊర మాస్ అనేలా ఉంటుందట. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇది చిరు 154వ చిత్రం. ఇక టైటిల్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య, వాల్తేరు వీర్రాజు అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫిక్స్ చేశారు అనేది తెలియాల్సివుంది. నవంబర్ 6న ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున టైటిల్ ప్రకటిస్తారేమో చూడాలి.