Chiranjeevi Daughter Sushmita Starts New Production Company :
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆమధ్య తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో తొలి ప్రయత్నంగా ‘షూటవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తన నిర్మాణంలో ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమిళంలో హిట్ అయిన 8 తూట్టాక్కల్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సుస్మిత సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమాను ఏక్ మినీ కథ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా గణేష్ దర్శకత్వంలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా హీరోయిన్‌గా గౌరీ జీ కష్ణ నటిస్తుందని తెలిసింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక విజయం సాధిస్తే చాలు ఆ హీరో బిజీ అయిపోతాడు. ఇప్పుడు సంతోష్ శోభన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మొన్నటి వరకు సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడ్డ సంతోష్ శోభన్ ఏమ్ మినీ కథ సక్సస్ అవ్వడంతో ఒక్కసారిగా బిజీ అయ్యాడు. ప్రభాస్ మిత్ర నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ ఏక్ మినీ కథ సినిమాను నిర్మించింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ కథ అందించాడు.
ఏక్ మినీ కథ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. సుస్మిత సినిమాతో ఈ సారి ఏకంగా మెగా కాంపౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు సంతోష్ శోభన్. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమాలో కూడా నటించబోతున్నాడు. మొత్తానికి ఏమ్ మినీ కథ సక్సస్ తో మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సుస్మిత ప్లాన్ చేస్తున్నారు. మరి.. చిరు డాటర్ సుస్మిత నిర్మాతగా సక్సెస్ సాధిస్తారని ఆశిద్దాం.
Must Read ;- చిరు సరసన బాలీవుడ్ భామలు.? ఇంతకీ ఏ సినిమాలో..?











