మెగాస్టార్ చిరంజీవి తన కమ్ బ్యాక్ తర్వాత.. వరుసగా సినిమాల్ని ఓకే చేస్తూ.. మిగిలిన సినియర్ హీరోస్ కి సవాల్ గా మారారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న ఆయన, దీని తర్వాత ముచ్చటగా మూడు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు. అందులో రెండు రీమేక్ వెర్షన్ కాగా.. ఒకటి స్ట్రైట్ మూవీ అవడం విశేషం.
మెహర్ రమేష్ దర్వకత్వంలో ‘వేదాళం’ తమిళ రీమేక్ , వివి వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ కాగా.. బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ ముగ్గురు దర్శకులూ స్ర్కిప్ట్స్ ఫైనల్ డ్రాఫ్ట్స్ ను ఎవరికి వారే వ్యక్తిగతంగా మెగాస్టార్ కి వినిపించారట. ఈ మూడు స్కిప్ట్స్ మీద చిరు తన సంతృప్తిని వ్యక్తం చేశారట. కాకపోతే.. ఆ ముగ్గురి స్ర్కిప్ట్స్ లోనూ ఆయన స్వల్ప మార్పులు సూచించారట.
ఎవరైతే ముందుగా ఫైనల్ వెర్ఫన్ ను ఆయనకి వినిపిస్తారో ఆ సినిమానే ‘ఆచార్య’ తర్వాత సెట్స్ మీదకు వెళుతుందని చెప్పారట. దాంతో మెహర్, వినాయక్, బాబీ ఎవరికి వారు ముందు గా తమ స్ర్కిప్టే తెరకెక్కించే వేగంగా మార్పులు చేయడంలో మునిగిపోయారట. మరి చిరు ఇచ్చిన సమయాన్ని ఏ దర్శకుడు ముందుగా సద్వినియోగం చేసుకుంటాడో, ఎవరి స్ర్కిప్ట్ ముందుగా చిరుని చేరకుంటుందో చూడాలి.











