మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యిందికానీ.. లేకపోతే ఈపాటికే ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయన్ అవుతారు. ఈ మూవీని మేనెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఆచార్య సినిమా రిలీజ్ బాగా ఆలస్యం అవ్వడంతో ఇక నుంచి ఇంత ఆలస్యం అవ్వకుండా వరుసగా సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆచార్య తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాని త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.
లూసీఫర్ రీమేక్ కంప్లీట్ అయిన తర్వాత వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ ఈ ఇయర్ లో ఉంటుందో ఉండదో అనుమానమే కానీ.. లూసీఫర్ రీమేక్ మాత్రం పక్కాగా దసరాకి రానుందని సమాచారం. ఈ లెక్కన చిరు ఈ సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేయనున్నారు. ఇక మెగా అభిమానులకు పండగే.
Must Read ;- చిరు, మహేష్ మూవీలో నటించడం పై క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్