మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , ఆయన అభిమానులు వివధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే టు యు చంద్రబాబు గారు అంటూ కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపిన విషెస్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
ట్విటర్ వేధికాగా చంద్రబాబుకు తన విషెస్ తెలిపిన చిరంజీవి ఓ పిక్‌ను కూడా షేర్ చేశారు. అదేసమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు..వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక చిరు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు తన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. “శ్రీ చంద్రబాబు గారికి భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.