కొందరు ముదురు బ్యూటీస్.. వయసు శరీరానికే కానీ.. మనసుకు కాదు అనేట్టుగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మరికొందరు.. వయసు మనసుకే కానీ.. శరీరానికి కాదన్నట్టుగా మంచి శరీర సౌష్ఠవంతో ఆశ్చర్యపరుస్తారు. ఇందులో రెండో కోవకు చెందిన సుందరి ముంబై బ్యూటీ నేహాశర్మ. రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన నేహా.. ఆ తర్వాత వరుణ్ సందేశ్ కుర్రోడు సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతోనూ సరైన గుర్తింపు రాకపోవడంతో.. ముంబై ఫ్లైట్ ఎక్కేసింది చిన్నది.

బాలీవుడ్ లో పలు చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించకుంది నేహా శర్మ. అయితే అక్కడా అమ్మడికి నిరాశే ఎదురైంది. గ్లామర్ ప్రపంచంలో పోటీ పెరిగిపోవడంతో అవకాశాలు రావడం కష్టంగా మారింది నేహాకి. వరుస అవకాశాలు ఉప్పెనలా ముంచెత్తాలంటే.. గ్లామర్ గేట్లు తెరిచేయడమే మార్గం అని చాలా లేట్ గా తెలుసుకుంది నేహాశర్మ. అందుకే ఈ లేటు వయసులో కూడా ఘాటుగా హాటుగా .. ఫోటోలకు పోజులిస్తూ.. బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది.

ప్రస్తుతం నేహా శర్మ ఇన్ స్టా ఖాతా తెరిస్తే తెలుస్తుంది. ఆమె గ్లామర్ కు హద్దులే లేవని. స్టార్ డమ్ అందుకోవాలంటే.. ఎక్స్ పోజింగ్ కు ఎల్లలు చెరిపేయాలని, హాట్ నెస్ కు హద్దులు తుడిచేయాలని ఆమె ఈ వయసులోనైనా తెలుసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆమె దాదాపు 13 ఏళ్లకు పైనే అవుతుంది. ఇంత కాలమైనా.. ఆమె అదే ఫిగర్ మెయిన్ టెయిన్ చేస్తోంది. ఇన్ స్టా లో రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన హాట్ ఫోటో చూస్తే మతిపోతుంది. ఎద అందాల్ని తెరిచిపెట్టుకొని.. ఎవరో దర్శక,నిర్మాతలకు ఎర వేస్తున్నట్టే అనిపిస్తోంది. ఆపాద మస్తకం తన అందాలు మొత్తం బైటపడేట్టుగా ఎలివేట్ చేస్తున్న డ్రెస్ లో ఇన్ స్టా ను వేడెక్కిస్తోంది. మరి ఈ చిరుత పిల్ల హాటు వేషాలకు ఏ రేంజ్ లో అవకాశాలొస్తాయో చూడాలి.
Must Read ;- బికినీ అందాలతో మతిపొగొడుతోన్న మలయాళ ముద్దుగుమ్మ












