గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలంగా అనేకమైన అరాచకాలకు తెగబడ్డ వల్లభనేని వంశీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం గన్నవరంలో చేసిన దురాక్రమణలు, దోపిడీతో పాటు విపక్షంపై చేసిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. ఇది మాత్రం ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఇలా అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి.. ఇప్పుడు ప్రభుత్వం దిగిపోగానే.. పత్తా లేకుండా పోయిన వల్లభనేని కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు గతంలో చేసిన అక్రమాలపై విచారణ చేస్తున్నారు. ఆయన ఇంటికి సీఐడీ అధికారులు వస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ విషయం ముందే తెలుసుకున్న ఆయన పరార్ అయ్యారని తెలుస్తోంది.
వల్లభనేని వంశీపై ఇప్పటికే ఒక కేసు రెడీ అయిపోగా.. ఉన్నతాధికారులు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం హాయాంలో వంశీ చేసిన అడ్డమైన పనులను వైసీపీ ప్రభుత్వం కప్పిపెట్టి ఉంచింది. ఇప్పుడు గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దా* చేసిన కేసును తిరగతోడారు. అప్పట్లో వల్లభనేని వంశీ దగ్గరుండి ప్లాన్ చేసి మరీ టీడీపీ ఆఫీసుపై మూకుమ్మడి దా* చేయించారు. టీడీపీ ఆఫీసుపై దా* జరిగితే.. ఆ కేసులో అప్పుడున్న పోలీసులు అరెస్ట్ చేసింది టీడీపీ వారిని. అంటే ఎంత దుర్మార్గంగా వైసీపీ దౌర్జన్యాలు చేసిందో అర్థం అవుతుంది.
టీడీపీ అధికార ప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పట్టభిరాంను అక్రమంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ కూడా వాడారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పోలీసులు కూడా సహజంగానే మారారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పాతి పెట్టిన కేసులను బయటికి తీసి.. వాటిలో దూకుడు పెంచుతున్నారు. కొత్త డీఎస్పీ సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీని, మీడియా వీడియోలు చూసి దాదాపు 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో వల్లభనేని వాహన చోదకుడు కూడా ఉన్నాడు. ఈ దా*ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడమే కాదు.. ఆ సమయంలో టీడీపీ ఆఫీసు దగ్గరే ఉన్నట్లుగా మీడియాలో ఆధారాలు కూడా వచ్చాయి.
అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దా*ని తామే చేశామని వల్లభనేని చెప్పుకున్నారు. కాబట్టి, ఈ కేసులో వంశీ అడ్డంగా దొరికేశారు. ఇదొక్కటే కాదు.. వంశీ చేసిన అక్రమాల కేసులన్నీ బయటికి తీస్తే ఆ తుపానుకు తట్టుకోలేరు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దా* కేసును ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంట్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే, వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇరుక్కున్నారు. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దా* కేసును డీఎస్పీ టేకప్ చేశారు. అయితే, ఇంత జరుగుతున్నా వల్లభనేని వంశీ ఎక్కడున్నారో క్లారిటీ లేదు. ఇది ముందే ఊహించి దేశం వదిలిపారిపోయేడేమో అని పలువురు చర్చించుకుంటున్నారు. విజయవాడలోనే ఉండే అవకాశాలు లేవని అంటున్నారు.