(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునాపురంలో ఓ వ్యక్తి దహన సంస్కారాల్లో తలెత్తిన వివాదం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అర్జునాపురం గ్రామంలో ఒక వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొన్న వైసీపీ,టీడీపీ వర్గీయులు పీకల దాకా మద్యం తాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ మరింత ముదరడంతో ఒకరిపై ఒకరు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన కిలుగు వెంకట్రావు, బాకీ చిరంజీవులు, కిలుగు నూకరాజు, కిలుగు తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సోంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ సోంపేట హాస్పిటల్లోని బాధితులను పరామర్శించారు.
పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యే
వైసీపీ వర్గానికి చెందినవారు కావాలనే తమ పార్టీకి చెందిన వారిపై తీవ్రంగా దాడి చేశారని … తక్షణమే ఘటనకు బాధ్యులైన వారిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో సోంపేట పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు పై బైఠాయించి ఎమ్మెల్యే నిరసన తెలిపారు.
Must Read ;- ఫ్యాక్షన్‌తో రగులుతున్న పల్నాడు: గ్రామాలను వదిలిపోయిన టీడీపీ నాయకులు