వందల సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన సంపదను ఎలా అన్వేషించారు. ఈ ప్రయాణంలో ఎదురైన దుష్ట శక్తుల ఆట ఎలా కట్టించారు అనే ప్రధాన ఇతివృత్తంతో `క్లూ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పృద్వి శేఖర్, జాస్మిన్ హీరో హీరోయిన్లు. రమేష్ రాణా దర్శకుడు. సుబాని అబ్దుల్ నిర్మాత. యస్ అండ్ యమ్ క్రియేషన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్, ఆకాష్ పూరి, రాహుల్ విజయ్, ప్రముఖ దర్శకుడు వీర శంకర్, ఫైట్ మాస్టర్ విజయ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న ఆకాష్ పూరి మాట్లాడుతూ..టీజర్ చాలా ఆకట్టుకుంటోంది. పృద్విశేఖర్ కు హీరోగా తొలి సినిమా అయినా ఎంతో చక్కటి నటనను పలికించారు. ఫైట్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. మేమంతా ఊహించినదానికంటే మరింత అద్భుతంగా చేశారు .భవిష్యత్ లో చాలా డిమాండ్ ఉన్న ఫైట్ మాస్టర్ అవుతారు. అలాగే హీరోగా కూడా పేరు తెచ్చుకోవాల` అని అన్నారు. ..
మరో అతిథి, దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ, దర్శకుడు చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించినట్లు, కొన్ని సన్నివేశాలు చూడగానే అర్ధమైపోయింది` అని అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ… మా అబ్బాయి పృద్వి ఫైట్ మాస్టరుగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరం కలిసి కష్టపడే పనిచేశాం. ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నాడు అని అన్నారు.
Also Read ;- మెగా డాటర్ కానీ ఫోటోలో ఉండి ఉంటేనా?
జార్జి రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి, యూనిట్ కు మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అన్నారు. చిత్ర దర్శకుడు రమేష్ రాణా మాట్లాడుతూ, ఆద్యంతం ఆసక్తికిని కలిగించేలా వైవిధ్యంగా చిత్రాన్ని మలిచాం. ఎక్కడా నిర్మాణ విలువలు విషయంలో రాజీపడలేదు. కథకు తగ్గట్లు మంచి లోకేషన్లలో షూటింగ్ చేసాం` అని చెప్పగా… చిత్ర నిర్మాత సుబాని అబ్దుల్ మాట్లాడుతూ. ర్యాప్ రాక్ షకీల్ అందించిన పాటలతో పాటు రీ రికార్డింగ్ మా చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. రమేష్ రాణా చిత్రాన్ని కొత్తదనంగా తీశారు అని అన్నారు.
హీరో పృద్వి శేఖర్ మాట్లాడుతూ, ఫైట్ మాస్టర్ గా సినిమాలు చేస్తున్న నాకు హీరో కావాలనే కోరిక ఉండేది. ఒక చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఫోన్ కాల్ రావడంతో నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో ఆశ పడ్డాను.. నిర్మాత సుబాని అబ్దుల్ అవకాశం ఇచ్చారు. రాహుల్, ఆకాష్ నన్నుఅభినందించడానికి వచ్చినందుకు వారికి కృతఙ్ఞతలు` అని అన్నారు.ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సంజన నాయుడు , షియాజీ షిండే, రాజా రవీంద్ర, జీవా, దేవ్ గిల్, శుభాంగిపంత్, మధు నారాయణన్ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్, కెమెరా: శ్రీనివాస్ సబ్బి, ఎడిటింగ్: సాయి భరద్వాజ విప్పర్తి, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్ ; షావోలిన్ మల్లేష్ , కుంగ్ ఫు శేఖర్, , స్క్రీన్ ప్లై-మాటలు: అప్సర్.
Must Read ;- కన్నడ స్టార్ హీరోపై కన్నేసిన‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు