చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. పని రాక్షసుడిగా గుర్తింపు పొందారు. చంద్రబాబు లాంటి నేతలు దేశ రాజకీయాల్లో చాలా అరుదు. తాజాగా భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, సీనియర్ రిటైర్డ్ IAS అధికారి R.H. ఖ్వాజా… చంద్రబాబుతో తనకున్న పాలన అనుభవాలను పంచుకున్నారు. రాజకీయ నాయకులు విధానాలను రూపకల్పన చేస్తే, వాటిని సమర్థవంతంగా అమలు చేయడమే సివిల్ సర్వెంట్ల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత స్పష్టమైన విజన్‌తో వ్యవహరించేవారని, ప్రజాపాలనలో ఆయన చూపించిన సంకల్పం , లీడర్‌షిప్ గొప్పవంటూ ఖ్వాజా కొనియాడారు.
రాష్ట్రం ఆర్థికంగా పురోగమించాలంటే ఏం చేయాలో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉండేదని ఖ్వాజా వివరించారు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించడం, పారిశ్రామికాభివృద్ధి సాధించడంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దక్షిణాదిలోనే ఏకైక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ..ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా 5 నుంచి 6 లక్షల మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఇలాంటి కీలక సంస్థలు, రంగాలు బలోపేతం కావడంపై చంద్రబాబు వద్ద స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉండేదని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబునాయుడి పనితీరు అత్యంత ప్రొఫెషనల్‌గా ఉండేదని, అధికారులతో ఆయనకు చాలా మంచి అనుబంధం ఉండేదని ఖ్వాజా తెలిపారు. రాజకీయ నాయకత్వంలో గట్టి పట్టుదల, స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు ఎలాంటి సంక్లిష్ట నిర్ణయాలనైనా సులభంగా అమలు చేయవచ్చని, చంద్రబాబు సరిగ్గా అదే చేశారని ప్రశంసించారు. ఆయన స్పష్టమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించడం వల్ల అధికారులకు పని చేయడం చాలా సులువైందని వెల్లడించారు.
అధికారులు చెప్పే విషయాలను చంద్రబాబు ఓపికగా వినేవారని ఖ్వాజా పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో అధికారులకు, నాయకత్వానికి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినా..వాటిపై సుదీర్ఘంగా చర్చించి, అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చేవారని చెప్పారు. అధికారుల సలహాలకు విలువనిస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకోవడమే చంద్రబాబు పాలనా శైలిలోని ప్రత్యేకత అని ఖ్వాజా స్పష్టం చేశారు.











