జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్దాలకు తెరతీశారు. ఇవి విన్న మైనార్టీలు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మైనారిటీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాలను ప్రభుత్వంన నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జగన్ రెడ్డి ప్రసంగించారు. ప్రసంగం ఆసాంతం పచ్చి అబద్ధాలను వండి వార్చారు. మైనారిటీల కోసమే తన రాజకీయ జీవితం అంతా.. అన్నట్లు కలరింగ్ ఇచ్చి.. మైనారిటీ ఓట్లును ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన వక్స్ బోర్టు భూములను.., వైసీపీ దౌర్భన్యాలకు, గుండాగిరికి ఆశువుల బాసి సమాధుల్లో ఉన్న మైనారిటీలకు బాగా తెలుసు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలతో అందరికీ ఇస్తున్న పథకాలను సైతం మైనారిటీ బడ్జెట్‌లో లెక్కించి.. తిమ్మిని బమ్మిని చేసి గత ప్రభుత్వ పథకాలను తుంగలో తొక్కి వంచిన సంగతి అందరికీ తెలిసిందే. 2019 జూన్ నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించిన ఘనత ఆయనకే దక్కుతున్న సంగతి విజ్ఞులైన మైనారిటీలకు తెలియనివి కావు. ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్ష మారిన సంగతి యువత బాగానే గ్రహించారు. దుకాన్, మకాన్ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్ధాంతరంగా నిలిపి వేసింది. మైనారిటీ భూములనే టార్గెట్ చేస్తూ కబ్జాలకుప పాల్పడుతున్న ఘటనలను ఎలా మరుస్తారు..? వైపీసీ నేతల బాధితులు జీవితాంత మరవని ఘటనలు మరెన్నో ఉన్నాయన్నది వాస్తవం.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయంలో ఉర్దూ యూనివర్సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించి దాదాపు పనులు పూర్తి చేస్తే.. జగన్ రెడ్డి దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాపంల్లిలో, నవ్యాంద్రలో రూ.25 కోట్ల వ్యయంతో కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కతోంది. రూ.80 కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోగా జగన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ పిచ్చికి పరాకాష్టగా అభివర్ణిస్తే.. మైనారిటీలపై దాడులు.., బెదిరింపులు, అక్రమ కేసులు మర్చిపోని చారితాత్మక తప్పిదాలు కావా..? అని మైనరిటీలందరూ మండిపడుతున్నారు.