స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. కాక్రొచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్టును ఖండిస్తూ జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో రాజకీయ దుమారానికి దారి తీసింది. సీబీఐ, ఈడీ కేసులు ఉన్నా ధైర్యంగా కేంద్రానికి ఎదురు వెళ్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు.. జగన్ స్టాండ్‌కి మద్దతుగా నిలిచారు. మరోవైపు వైసీపీ – సీజేపీ బంధంపై బీజేపీ నాయకులు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, పోలీసులను ప్రయోగించి ప్రజల హక్కులను కాలరాసిన ఘటనలను గుర్తు చేస్తూ.. ఏపీ బీజేపీ ఛీప్ పీవీఎన్ మాధవ్ జగన్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులతో పాటు నెటిజన్లు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. గతంలో జగన్ అవినీతిపరుడు అని కాక్రోచ్ లీడర్ సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి తెరపైకి వస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న వారసత్వ పార్టీల జాబితాలో వైసీపీ కూడా చేరిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నా.. జగన్ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిలవడంపై వైసీపీ సానుభూతిపరుల్లో సానుకూలత కనిపిస్తోంది. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో జగన్.. రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తే బాగుంటుందని ఆ పార్టీ అభిమానులు సూచిస్తున్నారు. ఈడీ కేసుల రోజువారి విచారణకు అనుమతించడంతో పాటు.. జగన్‌తో పాటు ఇతర నిందితులు కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే జగన్ సీజేపీకి మద్దతుగా పోస్టు చేశారు. అవినీతి కేసుల్లో ఈడీ దూకుడుతోనే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి జగన్ సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు.
కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎడ్జ్ కోసమే జగన్ కాక్రోచ్లకు సపోర్ట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాక్రోచ్ల అరెస్టుని ఖండించే పోస్టు ద్వారా బీజేపీని వ్యతిరేకించే వర్గాలను ఆకట్టుకోవడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. 2029 వరకు కేంద్రంలో ప్రభుత్వం మారదు. నేరుగా కేంద్రంపైనా, బీజేపీ పెద్దల మీదా విమర్శలు చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని వైసీపీ అధినేతకు తెలుసు. కేవలం కాక్రోచ్లకు సపోర్ట్ చేసి.. అరెస్టులతో ఉపయోగం ఉండదని కేంద్రానికి సలహా ఇస్తూ.. ట్వీట్ చేయడంతో.. ఇది రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుంది. మరి ఏపీ ప్రజలు ఈ పొలిటికల్ ట్రిక్స్‌కి పడిపోతారా.. అటు బీజేపీతో.. ఇటు కాక్రోచ్‌లతో ఆడుతున్న డబుల్ గేమ్‌ని గుర్తిస్తారా.. జగన్ మాటలకు అర్ధాలే వేరు అని ఆయనే చాలాసార్లు నిరూపించుకున్నారు. ఇప్పుడు కాక్రోచ్లకి మద్దతు పలకడం వెనకున్న పరమార్ధం ఏంటో త్వరలోనే తెలుస్తుంది.











