ఓ సినిమా విషయంలో నిర్మాత అడ్డాల చంటి, నట్టి కుమార్ ల మధ్య ఏర్పడిన గొడవ తగ్గేటట్టు కనిపించడం లేదు. సినిమా పేర్లు ఎవరికి అనుకూలంగా మార్చేసుకుని ఇది నాదంటే నాది అని కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా ఇది ఇద్దరి మధ్యా జరిగిన లావాదేవీలకు సంబంధించిన విషయం. ఎంతకీ ఇది తెగకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేదాకా విషయం వెళ్లింది. నట్టి కుమార్ మరో నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వే’ హక్కులు అమ్మినందుకు రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేశా. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తర్వాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేశాడు. దీన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నా. చంటి అడ్డాల మాత్రం నామీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను కూడా అతనిపై ఫిర్యాదు చేశా. పోలీసులపైనా, న్యాయస్థానాలపైనా నాకు నమ్మకం ఉంది’ అన్ని పేర్కొన్నారు.











