అక్కినేని అఖిల్ 5వ సినిమాగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి ఏజెంట్ అనే టైటిల్ ను ఖాయం చేస్తూ… అతడి పుట్టిన రోజునాడు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది. గూఢచారి గా అఖిల్ మేకోవర్ అభిమానుల్ని కట్టి పడేస్తోంది. ఈ సినిమా అతడికి తప్పకుండా మంచి హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
హాలీవుడ్ బోర్న్ సిరీస్ లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో తెలిసిందే. అందులో జాసన్ బోర్న్ గా నటించిన మేట్ డామన్ కు చాలా మంచి పేరొచ్చింది. ఆ సిరీస్ లో మొదటి సినిమాగా వచ్చిన బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా ఈ సినిమా రూపొందనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ చేస్తున్న ఏజెంట్ పాత్ర డిజైనింగ్ అద్భుతంగా వచ్చిందట. వక్కంతం వంశీ అందించిన కథ అభిమానుల్ని మెప్పిస్తుందని చెబుతున్నారు.
ఇక ఇందులో ఏజెంట్ కు మెంటార్ లాంటి పాత్ర కోసం మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను సంప్రదించారట. దర్శకుడు సురేంద్ర రెడ్డి నెరేట్ చేసిన కథకు బాగా ఇంప్రెస్ అయిన మోహన్ లాల్ .. ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ అక్కినేని హీరోగా నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.
Must Read ;- యాక్షన్ హీరోగా అఖిల్ తో సురేందర్ రెడ్డి ప్రయత్నం











