టెండర్ మనోడికి రావాలంటే.. క్వాలిఫికేషన్ కండిషన్స్.. వాడికి తగ్గట్టు పెట్టడం అనేది ఇప్పుడు బాగా అలవాటైపోయింది. అనుభవం, టర్నోవర్ అన్నీ అలా మార్చేస్తారు. ఇప్పడు రాజ్యాంగబద్ధ పదవులకు కూడా అలా మార్చుకుపోతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను ఎలాగైనా తప్పించి.. తమకు కావాల్సినవారిని పెట్టుకోవడానికి వైసీపీ ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. ఒక ఆర్డినెన్స్ తెచ్చి.. ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లకు తగ్గించేసి.. దానికి తగ్గట్టుగా నిమ్మగడ్డను తొలగించేసి. రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ని తమిళనాడు నుంచి స్పెషల్ ఫ్లయిట్‌లో అది కూడా కరోనా ఆంక్షల సమయంలో.. తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్ పదవిలో కూర్చోబెట్టారు. నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో కోర్టులు ఆ ఆర్డినెన్స్‌ను కొట్టేసి.. మళ్లీ నిమ్మగడ్డనే కూర్చోబెట్టాలని ఆదేశించాయి. అప్పటికీ మళ్లీ కుర్చీలో కూర్చోవడానికి నిమ్మగడ్డ కోర్టు నుంచే ఆదేశాలు తెచ్చుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు రిటైర్డ్ జడ్జి అవసరం పడలేదు..
ఇంత కథ నడిపించిన వైసీపీ.. నిమ్మగడ్డను తీసేయడం కోసం.. రిటైర్డ్ జడ్జిని పెట్టి ఏదో పెద్ద నీతివంతమైన వ్యవహారం నడిపించినట్లు ఫోజు పెట్టారు. కాని ఇప్పుడు నిమ్మగడ్డ టైమ్ అయిపోయింది. కొత్తవారిని పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం రిటైర్డ్ జడ్జి అవసరం పడలేదు. వీర విధేయులైన రిటైర్డ్ ఐఎఎస్‌లు చాలా మంది ఉన్నారు కాబట్టి.. ఆ జోలికే పోలేదు. అప్పుడంటే నిమ్మగడ్డను తీసేయడానికి అది కావాల్సి వచ్చింది.. ఇప్పుడలా కాదుగా. తమకు అన్ని విధాలా అనుకూలంగా పని చేసి.. కోర్టు ధిక్కారానికి కూడా భయపడకుండా చెప్పినవి చెప్పినట్లు చేసిపెట్టిన నీలం సాహ్నికే పదవిని కట్టబెట్టారు.
ఇక్కడా మరో డ్రామా..
నీలం సాహ్నికి పదవి ఇవ్వటానికి కూడా మరో డ్రామా ఆడారు. లియో న్యూస్ ముందే చెప్పింది.. నీలంకే పదవిని ఇస్తున్నారని. కాని మీడియాలో శామ్యూల్‌కి ఇస్తారని.. ప్రేమచంద్రారెడ్డి పేరు కూడా ఇఛ్చారని.. ఆయనకే అవకాశం ఉందని.. రకరకాలుగా కథనాలు వచ్చాయి. చివరకు మాత్రం నీలం సాహ్నికే ఇచ్చారు. ఫార్మాలిటీకి ఎటూ మూడు పేర్లు పంపాలి. ఆ మూడు పేర్లలో ఒక పేరు నీలం సాహ్ని ఖచ్చితంగా ఉండాలని తెలుసు. అలాగే చేశారు. ఆమెకు ఇస్తున్నట్లు లీకులొచ్చేస్తే.. మేడమ్ చాలా వినయంగా సహకరించారు కాబట్టే ఇస్తున్నారని.. అలాంటావిడ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటే వైసీపీకే ఫుల్లు కోఆపరేషన్ చేస్తారని ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. అందుకే తెలివిగా శామ్యూల్‌కి ఇస్తున్నట్లుగా లీకులిచ్చారు.
65 ఏళ్లు దాటిన వారికి అర్హత ఉండదని తెలిసే..
శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డిలకు నిబంధనలు సరిపోవని తెలుసు. 65 ఏళ్లు దాటిన వారికి అర్హత ఉండదని తెలుసు. అయినా కావాలని వారి పేర్లు పెట్టి పంపించారు. అటు ఇటు చేసి బినామీ కంపెనీల పేర్లతో టెండర్లు వేసి.. టెండర్ చివరకు తమకే దక్కేలా చేసుకునేలా… ఇక్కడ కూడా చేశారు. చివరకు నీలం సాహ్నికే పదవి వరించేలా పక్కా ప్లాన్ ప్రకారం చేసుకున్నారు.