హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో వాటర్ ట్యాంక్ ప్రారంభించడానికి సమయానికంటే ముందే వచ్చి వెళ్లిపోయారు కేటీఆర్. అదే సమయానికి అక్కడికి చేరుకుని కేటీఆర్‌ని కలవానుకన్న కాంగ్రెస్ నాయకులకు నిరాశ ఎదురైంది. సమయానికంటే ముందే వచ్చి వెళ్లిపోయారని కేటీఆర్‌ని ఉద్దేశించి ‘సిగ్గు.. సిగ్గు’ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు అక్కడికి చేరుకున్న రేవంత రెడ్డి.. సమయానికంటే అక్కడికి వచ్చి ముందే వచ్చి ఎలా వెళ్లిపోతారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డినీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ జెండాలను చించేసి నానా యాగీ చేశారు. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు. అంతేకాదు స్థానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. ఇలా గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోతూ.. ప్రతిసారీ తప్పించుకు తిరుగుతున్నారని కేటీఆర్‌ని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అందరూ అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు చెప్తున్నా వినకుండా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.
Must Read ;- టీపీసీసీ సారథి రేవంత్ కాదు, జీవన్ రెడ్డి!