కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,332 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,002 మంది మృతి చెందారు. 1,21,311 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,79,11,384గా ఉంది. ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు తగ్గుతుండటంతో పాక్షిక లా క్ డౌన్ అమలు చేస్తున్నాయి.
Must Read ;- రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు..