Corona Vaccine Shortage in AP :
ఏపీలో కరోనా టీకాకు తీవ్ర కొరత ఏర్పడింది. 11వ తేదీ నుంచి 14 వరకు కరోనా టీకా ఉత్సవాలు నిర్వహించాలని సాక్షాత్తూ ప్రధాని మోడీ ప్రకటించినా, ఏపీలో మాత్రం కరోనా టీకా దొరకడం లేదు. 11 నుంచి 14వ తేదీ వరకు రోజుకు 6 లక్షల మందికి కరోనా టీకా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా వైద్యాధికారులను ఆదేశించారు. ఏపీలో కరోనా టీకా కొరత ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయినా సరఫరా మెరుగు పడలేదు. కేవలం రోజుకు 60 వేల మందికి మించి కరోనా టీకా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఇవాళ టీకా వచ్చే అవకాశం
ఇవాళ సాయంత్రానికి 3.5 లక్షల కరోనా టీకాలు అందుబాటులోకి వస్తాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కరోనా టీకా లేకపోవడంతో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీకా వేసే కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కూడా నెలకొంది. ఏపీలో ఒక్క రోజే 3450 మందికి కరోనా సోకింది. 9 మంది చనిపోయారు. ఇప్పటికే ఏపీలో పది లక్షల మంది కరోనా భారిన పడ్డారు. 9 వేల మందికిపైగా చనిపోయారు. ఇంకా ఏపీలో 18వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య అధికారులు వెల్లడించారు.
Must Read ;- కలవర పెడుతున్నకరోనా సెకండ్ వేవ్.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు