కరోనా వ్యాక్సిన్ అదిగో… అల్లదిగో అంటూ అగ్రరాజ్యం అమెరికాతో సహా రష్యా, చైనా వంటి దేశాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం “అబ్బే ఇప్పట్లో కష్టం గురూ“ అని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ అవాక్కయ్యే పరిస్థితి ఎదురైంది. ప్రపంచ ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన, చేస్తున్న వ్యాక్సిన్ కోసం ఇంతింత కళ్లు చేసుకుని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మూడో దశ పరీక్షలు ఇంకా పూర్తి కాకుండానే అమెరికా నవంబర్ 1 నాటికి వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలంటూ అక్కడి రాష్ట్రాల గవర్నర్ లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రష్యా కూడా అదిగో కరోనా అంటే ఇదిగో వ్యాక్సిన్ అంటూ ప్రకటనలు గుప్పించింది. వీటన్నింటినీ గమనిస్తూనే ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం నాడు కీలక ప్రకటనలు చేసింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని, వచ్చే సంవత్సరం మధ్య కాలం నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ ప్రకటించారు. శుక్రవారం సంస్ధ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మార్గరెట్ హ్యారిస్ మాట్లాడుతూ “వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంస్థలు వాటి ప్రభావం ఏ మేరకు చూపుతాయో చెప్పలేవు. ఇందుకోసం వచ్చే సంవత్సరం మధ్య కాలం వరకూ వేచి చూడాల్సిందే“ అని తేల్చేశారు.
మూడో దశే కీలకం
వ్యాక్సిన్ తయారీలో మొదటి రెండు దశలు ఎలాంటి ప్రభావం చూపుతాయో త్వరగా తేలిపోతుందని, మూడో దశ ప్రయోగమే ఇందులో కీలకమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ అభిప్రాయపడ్డారు. “వ్యాక్పిన్ తయారీలో మూడో దశ అత్యంత కీలకం. దీనికి ఎంత సమయం పడుతుందో ఇదిమిద్దంగా చెప్పలేం “ అని ఆమె స్పష్టం చేశారు. ఇలా తయారైన వ్యాక్సిన్లు కరోనాను ఎంత వరకూ నియంత్రిస్తాయో… ఏమేరకు రక్షణ కల్సిస్తాయో వెంటనే తేలిపోయే అంశం కాదని, ఇందుకోసం నెలల తరబడి సమయం అవసరమవుతుందని ఆమె అన్నారు.
విరుద్ధ ప్రకటనలతో బెంబేలు
కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సిన్ వచ్చేస్తోందంటూ అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రకటనలతో ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ వ్యాక్సిన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం విరుద్ధంగా ప్రకటనలు చేయడం ప్రపంచ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందంటున్నారు. ఎంత త్వరగా వ్యాక్సిన్ వచ్చి ఈ ఇబ్బందులు, భయాల నుంచి బయట పడతామని ప్రపంచమంతా ఎదురుచూస్తూంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు మాత్రం భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయాల వంటివే వ్యక్తం చేయడం కూడా భయాందోళనలు కలిగిస్తోంది. నవంబర్ 1 నాటికి వ్యాక్పిన్ వస్తుందని అమెరికా ప్రకటిస్తే ఫౌచీ మాత్రం అక్టోబర్ చివరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలే లేవని తేల్చేశారు. ఇది కూడా అమెరికా వాసులతో పాటు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న దేశాల ప్రజలకు మింగుడుపపడం లేదు.
మా రాబంధువు జగన్ దోచుకున్నాడు…. బాలినేని సంచలనం..!!
బాలినేని శ్రీనివాస్ రెడ్డి..మాజీ సీఎం జగన్కు అత్యంత సమీప బంధువు. అంతేకాదు గత...