కరోనా వైరస్ రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో కరోనా కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి… అవి కరోనా వైరస్ కంటే శక్తివంతమైనవని గత కొన్నాళ్లుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కరోనా వైరస్ లక్షణాల జాబితా కూడా పెరుగుతూనే ఉంది.. ఇప్పటివరకూ బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని జత చేరాయి. అవేమిటంటే…?
లక్షణాలివే…
ఒళ్ళు నొప్పులు, కండ్ల కలక, కళ్ళు ఎర్రగా మారడం, గొంతు మంట , శరీరంపై దద్దుర్లు, అతిసారం. తలనొప్పి, కాళ్ళు చేతులు పాలిపోయినట్లు కనిపించడం స్ట్రెయిట్ కొత్త లక్షణాలని నిపుణులు చెప్పారు. వీటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవడం బెటర్ అని చెప్పారు. రిజల్ట్ వచ్చే వరకూ ఐసొలేట్ అవ్వడం మంచిదని బయటకు వెళ్లడం కూడా మానేయాలని హెచ్చరిస్తున్నారు.
Must Read ;- ఈ ఎమ్మెల్యే రూటే సెపరేటు.. ఇంటి వద్దే కరోనా టీకా
పిల్లలకు ప్రమాదం లేదు కానీ…
కరోనా వల్ల పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదు. వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నాయని గణాంకాలు కూడా చెబుతున్నాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ప్రభావం చూపుతాయట. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం ఒక ఏడాది పడుతుందని అంచనా. ప్రస్తుతానికి 16 ఏళ్లలోపువారికి ఇవ్వడానికి అవసరమైన అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఏదీ లేదు. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.
పిల్లల్లో కనిపించేవి..
- తరచుగా జ్వరం
- చర్మంపై దద్దుర్లు, కాలివేళ్ల వాపు
- కళ్లు ఎర్రగా మారడం
- కీళ్లనొప్పులు
- వికారం, పొత్తికడుపులో నొప్పి,
- జీర్ణ సమస్యలు
- పెదాలు నల్లగా మారడం