ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రతి సంవత్సరం అద్భుతుంగా జరుగుతాయి. అందునా మన హైదరాబాద్‌లో డిసెంబర్ 31న నగర వాసులు అసలు నిద్రపోరు. కేవలం యువతమాత్రమే అనుకునేరు, పిల్లలు, ముసలివాళ్లు సైతం న్యూ ఇయర్ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారు. అందుకోసం చిన్న రెస్టరెంట్స్ నుండి స్టార్ హోటల్స్ వరకు ప్రత్యేక ఏర్పాట్లు, ఆఫర్లు పెడ్తాయి. కనీసం 2021లో ఇలాంవేవీ చేసుకునే అవకాశాలు కనిపించడం. కేవలం ఇంటి పార్లీలు మాత్రమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వేడుకలపై నిషేధం..
హైదరాబాద్ సీపీ సజ్జనార్, న్యూ ఇయర్ వేడుకల్ని రద్దు చేస్తున్నట్లు ప్రత్యేక ప్రకటన విడుదలు చేశారు. అంతేకాదు, ఇప్పటి నుండే డ్రంక్ & డ్రైవ్ టెస్ట్‌లు చాలా కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాగి వాహనం నడుపుతూ దొరికితే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. రిసార్ట్స్, పబ్స్, క్లబ్స్‌కు న్యూఇయర్ వేడుకలకు అనుమతులు ఇవ్వడం లేదంటూ అధికారక ప్రకటన విడుదల చేశారు. అలా నిర్వహిస్తూ దొరికితే ఆ నిర్వాహకులపై కేసులతోపాటు, లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.
వీటితోపాటు.. గేడెట్ కమ్యూనిటీలో కూడా నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవని చెప్పారు. అంతేకాదు.. హోటల్స్‌లో కూడా రోజువారి చర్యలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త సంవత్సరానికి సంబంధించి ఈవెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని మీడియా ద్వారా తెలియజేశారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను ఉల్లంఘించకుండా.. సాధారణంగా వేడుకల్ని చేసుకోవాలని తెలియజేశారు.
Muast Read ;- న్యూఇయర్‌కు కర్ఫ్యూ కానుక : ఏంటి సంగతి?











