జగన్ తనను తాను రక్షించుకోవడం కోసం కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నో అక్రమ ఆస్తులు కూడబెట్టిన జగన్ కు జైలు భయం పట్టుకుందని పట్టుకుందని ఆరోపించారు. స్వీయరక్షణ కోసమే కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని, అందుకోసమే ప్రధాని నరేంద్రమోడీపాటు బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు.
అనంతరం ఈటల రాజేందర్ వ్యవహరంపై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈటల రాజేందర్ చురుగ్గా పనిచేశాడని, ఆయనపై కక్ష కట్టి బయటకు పంపించారని వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీలో వెళితే.. కేసీఆర్ కు తీవ్ర నష్టం కలగడం ఖాయమని నారాయణ అన్నారు.
Must Read ;- ఆనందయ్య మందు కేంద్రాన్ని పరిశీలించిన నారాయణ.. సంచలన వ్యాఖ్యలు











