పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా దగ్గుబాటి సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం.
ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో భీమ్లా నాయక్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తుందని మేకర్స్ ఎన్ని సార్లు ప్రకటించినా.. వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే అనుమానాలు ఇంకా ఉన్నాయి. అయితే.. నిర్మాణ సంస్థ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే సంక్రాంతికి రావడం పక్కా అనిపిస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన న్యూ టీజర్ అండ్ ట్రైలర్ కట్ వర్క్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యిందట. డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఆ రోజున సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. అయితే.. రానా పుట్టినరోజుకు టీజర్ రిలీజ్ చేస్తారో.. సరికొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారో చూడాలి.











