స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి పుష్ప సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఇది రెగ్యులర్ మూవీ కాదు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న సినిమా అని అర్థం అయ్యింది. ఇక ఎప్పుడైతే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారో.. అవి అంచనాలకు మించి సక్సస్ అయ్యాయో.. అప్పటి నుంచి పుష్ప సినిమా కోసం బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ భారీ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచాలి అనుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం.. ఈ టీజర్ లో బన్నీ, రష్మిక క్యారెక్టర్స్ తో పాటు విలన్ పాత్రధారి ఫాహిద్ ఫాజిల్ క్యారెక్టర్ ను కూడా పరిచయం చేస్తున్నారట. ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిసింది. అలాగే ఈ సినిమాలో కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ కూడా నటిస్తున్నారు. సునీల్ కూడా విలన్ పాత్రనే పోషిస్తున్నారు. సునీల్ పాత్రను కూడా ఈ టీజర్ లో చూపించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు పుష్ప సినిమా పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఈ టీజర్ ను సుకుమార్ కట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టీమ్ నమ్మకంగా ఉంది. మరి.. పుష్ప న్యూ టీజర్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ ఐకాన్ మళ్లీ ఆగిపోయిందా..?