మొన్న కాంతార, నిన్న మసూద.. పేరులోనే కాదు కథ కథనాల్లో కూడా కొత్త దనానికి నిర్మాతలు పెద్ద పీట వేస్తున్నారు. ఈ కోవలోనే జాన్ సే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు కిరణ్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. కాంతార, మసూద కోవలోనే ఇది కూడా కొత్త తరహా థ్రిల్లర్ కథాంశంతో దీన్ని నిర్మిస్తున్నారు. యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా ఇందులో ఉంటుందని దర్శకుడు అంటున్నారు.
అంకిత్ ఇంతకుముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించారు. హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. రూ 10 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కిరణ్ కుమార్ చెప్పారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో పూర్తి షూటింగ్ పూర్తవుతుంది. సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఏ కే శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు.
సచిన్ కమల్ సంగీతం సమకూరుస్తున్నారు. బీఏ రాజు టీమ్ ఈ సినిమా ప్రచార బాధ్యతలను చేపట్టింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త తరహాలో ఈ సినిమా ఉంటుందని, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఇది నూటికి నూరు శాతం నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం సినిమా రంగం కొత్త ఫేజ్ లో ఉందని, అందుకే దానికి తగ్గ కథాంశాన్ని ఎంచుకుని ముందుకు వెళుతున్నామని దర్శకుడు వివరించారు.