దగ్గుబాటి వారసుడు అభిరామ్ మరోసారి వార్తల్లో కెక్కాడు. ఈసారి కారు ప్రమాదంతో. ప్రమాదానికి గురైనా కారులో అభిరామ్ ఉన్నాడా? అతనితో ఇ:కెవరెరు ఉన్నారు ? అన్నది తేలాల్సి ఉంది. ఇంతకుముందు నటి శ్రీరెడ్డి అభిరామ్ ను అల్లరిపాటు చేసింది. తాజాగా ఈ కారు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని సమాచారం. గతంలో దగ్గుబాటి సురేష్ బాబు కారు కూడా ఒకసారి ప్రమాదానికి గురైంది ముగ్గురు గాయపడ్డారు. అప్పట్లో ఆయన మీద కేసు కూడా నమోదైంది. దగ్గుబాటి కుటుంబంనుంచి హీరోగా తెరంగేట్రం చేయడానికి సరైన సమయం కోసం చూస్తున్న అభిరాం గతంలోనే అనేక సార్లు వార్తల్లో కెక్కారు. నటి శ్రీరెడ్డి వివాదం తారస్థాయిలో ఆయన పేరు కూడా వార్తల్లో కనిపించింది. ఇప్పుడు అన్నయ్య రానా పెళ్లి జరిగిన నాలుగు రోజుల తర్వాత.. అభిరామ్ కారు ప్రమాదానికి గురైందివార్తల్లోకి ఎక్కే సినిమా ప్రముఖులు కొందరిలో ఇప్పుడు అభిరామ్ కూడా చేరిపోయాడు. బుధవారం రాత్రి ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదం వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు మెకానిక్ లక్ష్మణ్‌ను తీసుకొని కారు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. మణికొండలో యజమాని నుంచి కారు తీసుకుని టెస్ట్ డ్రైవ్ కోసం స్నేహితుడు సతీ్‌షతో వెళ్లాడు. పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ పక్కరోడ్డు నుంచి దగ్గుబాటి అభిరామ్ కారులో రావడంతో ప్రమాదం చోటుకేసుకుంది. రెండు కార్లూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. అభిరాం, రాజు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేశారు. మద్యం తాగలేదని, ఇరువురూ రాంగ్ రూట్‌లో వచ్చారని పోలీసులు తేల్చారు. దగ్గుబాటి రానా తమ్ముడైన అభిరామ్ కు దూకుడు కాస్త ఎక్కువేనని పరిశ్రమలో అంటుంటారు. అందరితో కలుపుగోలుగా ఉండటం అతని స్వభావం. ఈపాటికే అతను నటుడిగా రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. తన బాబాయ్ వెంకటేష్ నటిస్టున్న నారప్పలో ఓ పాత్ర కోసం మొదట అభిరామ్ ను అనుకున్నారు. అందులో అభిరామ్ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలనేది అభిరామ్ ఉద్దేశం. తన తాతయ్య బతికి ఉంటే ఎప్పుడో హీరో అయి ఉండేవాడినని అభిరామ్ అంటుంటారు. తనను హీరోగా చూడాలనేది తాత కోరిక అని చెబుతుంటారు. నిర్మాతగా తాత బాటలోనూ పయనించాలని అంటుంటారు. కానీ ఆయన తండ్రి సురేష్ బాబు మాత్రం అభిరామ్ విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. దానికి కారణం అతను తండ్రి మాట వినకపోవడమేనని సినీ వర్గాలు అంటుంటాయి. ఇటీవలే ఆ కుటుంబంలో వివాహ వేడుక కూడా జరిగింది. రానా, మిహీక వివాహం ముగియగానే ఇలాంటి వార్త వినవచ్చింది. ప్రమాదం చిన్నదే అయినా సినిమా వ్యక్తి కావడం, గతంలో శ్రీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది.
క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి కుటుంబం
కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదానికి గురైందనీ, ఎదురుగా వస్తున్న కారును ఆయన కారు ఢీకొట్టిందనీ మీడియాలో, ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని అభిరామ్ కుటుంబసభ్యులు ఖండించారు. అది కేవలం వదంతి మాత్రమేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అసలు దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాదనీ వారు స్పష్టం చేశారు. ఈ విషయంలో దయచేసి వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని వారు కోరారు.
ఆ కారు నాది కాదు: జబర్దస్ట్ అభి
దగ్గుబాటి అభి కారు ప్రమాదం వార్త ఓ పక్క వైరల్ అవుతుంటే మరో పక్క ఆ కారు జబర్దస్ట్ అభిదని వదంతులు కూడా వ్యాపించాయి. తను అసలు బయటికే వెళ్లడం లేదని జబర్దస్ట్ అభి ది లియోన్యూస్ కి స్పష్టం చేశారు. తనకు ఇలా చాలా ఫోన్లు వచ్చాయని, అందుకే దీనిపై వివరంగా పోస్ట్ కూడా పెట్టానని చెప్పారు. కరోనా కారణంగా తను బయట తిరగడం లేదని చెప్పారు.











