దళిత సామాజిక వర్గానికి చెందిన క బాలుడిని చితకబాడీ బూట్లు నాకించారు కొందరు యువకులు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. జగత్పూర్ పట్టణానికి చెందిన ఓ బాలుడిని అతని స్నేహితుడు బైక్పై ఎక్కించుకుని రామ్లీలా మైదానం వైపు తీసుకు వెళ్లాడు.కాగా దారిలో మరి కొందరు వారిని కలిసిణ మరి కొందరు యువకులు ఆ బాలుడిని సమీపంలోని ఒక తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ బాలుడి స్నేహితుడు, మిగిలిన వారు ఆ బాలుడిని చితకబాదారు. అనంతరం బాలుడితో బూట్లు నాకించారు. అంతటితో ఆగకుండా మొత్తం ఉదంతాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటణ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బాధిత బాలుడి కుటుంబ సభ్యులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను నేరుగా కలిసి దాడి ఘటణను వివరించారు.అదేసమయంలో నిందితుల ఇళ్లను కూల్చివేయాలని, తమకు, తమ కుమారునికి రక్షణ కల్పించడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుందని ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేసింది.