నేడు టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే. సినీ ప్రముఖులందరూ సుక్కూకి జన్మదిన శుభకాంక్షలు తెలియచేశారు. అయితే అందులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా ఉన్నాడు. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల కన్నడ రీమేక్స్ లో దర్శన్ నటించి.. అక్కడ తన స్టార్ డమ్ ను పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు దర్శన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సుక్కుని తను కలిసిన ఫోటోను షేర్ చేసి మరీ అతడికి బర్త్ డే విషెస్ తెలిపాడు. దాంతో బన్నీ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప’లో విలన్ అతడే అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
నిజానికి ‘పుష్ప’లో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల విజయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలా మంది నటుల పేర్లు వినిపించాయి . కానీ వాటిలో ఏదీ నిజం కాలేదు. ఫైనల్ గా దర్శన్ ను విలన్ గా తీసుకునే ఆలోచనలో సుక్కూ ఉన్నాడనే న్యూస్ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది. గతంలో కన్నడ హీరో సుదీప్ ఈగలో విలన్ గా నటించి మెప్పించాడు. అలాగే.. ఉపేంద్ర సైతం నెగెటివ్ రోల్స్ లో అలరించాడు. ఇప్పుడు దర్శన్ కూడా టాలీవుడ్ లో విలన్ గా నటించనుండడం ఆసక్తిని రేపుతోంది. మరి దర్శన్ సుక్కూని కాజువల్ గా కలిశాడో లేక ‘పుష్ప’ సినిమా కోసం అఫీషియల్ గానే కలిశాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- సుకుమార్ అంటే ఓ ప్రయోగం .. ఓ సాహసం
Wishing you a very Happy Birthday Director @aryasukku Sukumar Garu 🎂🎂 Have a great success ahead….#HBDSukumar #HappyBirthdaySukumar #Sukumar pic.twitter.com/uOW0VdQyem
— Darshan Thoogudeepa (@dasadarshan) January 11, 2021