రోజుకో గుడ్డు తినండి.. అనారోగ్యానికి దూరంగా ఉండండి. ఇలాంటివి ఎన్నో వింటుంటాం. మరి శాఖాహారుల సంగతేంటి? గుడ్డులోని పోషకాలు, రుచి వారికెలా అందుతాయి. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. ఢిల్లీకి చెందిన ఐఐటి విద్యార్థులు వేగన్స్ కోసం గుడ్డును కనుగొన్నారు. వింటుంటేనే నోరూరిపోతుందా.. కానీ అదెలా ఉంటుందో.. రుచెలా ఉంటుందో.. దాని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయో.. వెంటనే ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదుడును తొలిచేస్తాయి. మరి వాటికన్నిటినీ సమాధానాలు తెలుసుకోండి..
అసలు ఈ గుడ్డును వేటి నుంచి తయారుచేస్తారు?
ప్రతి ఇంట్లోను సాధారణంగా వాడే పెసలపప్పుతో ఈ గుడ్డును తయారుచేశారు విద్యార్ధులు. వేగన్స్ పాల ఉత్పత్తులు కూడా తినరనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త పదార్థాన్ని తయారు చేసినట్టు చెప్తున్నారు ఐఐటి స్టూడెంట్స్. ఢిల్లీ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కావ్య దశోరా ఆధ్వర్యంలోని టీమ్ ఈ గుడ్డును కనిపెట్టినట్టారు. ఈ గుడ్డును తయారుచేయడానికి వారికి సంవత్సరకాలం పట్టినట్లుగా చెప్తున్నారు. ఇక రుచి విషయానికొస్తే, అచ్చం కోడిగుడ్డు లాంటి రుచే వచ్చేలా జాగ్రత్తులు తీసుకున్నారట.. అంతేనా.. గుడ్డులోని పోషక విలువలకు సమానంగా ఉండేలా ఈ గుడ్డును తయారుచేసింది ఐఐటి టీమ్. గత నెలలో పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఈ గుడ్డును ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు.
Must Read ;- 2020 ఫేమస్ ఫేవరెట్ ఫుడ్.. సెకనుకో బిర్యానీ హాంఫట్

గుడ్డు రూపెలా వస్తుంది?
గుడ్తు రుచి, పోషకాలు సంగతి సరే.. మరి కోడిగుడ్డును పోలిన రూపు ఎలా తీసుకొస్తున్నారని తెలుసుకోవాలనుంది కదా.. అందుకోసమే ప్రొటీన్ ఐసోలేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గుడ్డు రూపు వచ్చేలా తయారుచేస్తున్నారు. ఇక గుడ్డులోని పదార్థాలను తయారుచేయడానికి ఎక్స్‌ట్రూషన్ టెక్నాలజీని ఉపయోగించినట్టు వెల్లడించారు. తొందరలోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది, ఈ వేగన్ గుడ్డులో బ్యాడ్ కొలస్ట్రాల్ అనేది ఉండదు.
పోషకాల గని
వేగనిజం పాటిస్తున్న వారు, డైట్ పాటించే వారికి కొలస్ట్రాల్ లేని, ప్రొటీన్స్‌కి ఎటువంటి లోటు లేని ఈ గుడ్డు ఎంతగానో తోడ్పడుతుందని అంటున్నారు ప్రొఫెసర్ కావ్య. ఇకపై వేగన్స్ గుడ్డు సమస్య తీరినట్టే.. అదే రూపు, రుచి, పోషకాలు కలిగిన వేగన్ గుడ్డు లభిస్తే ఇంకేం కావాలి? ఇకపై ఆమ్లెట్ అనగానే వెజ్ లేదా నాన్‌వెజ్ అనేది కూడా చెప్పాలి.
Also Read ;- ఓ తల్లి ఆలోచనకు రూపమే ఈ ‘మసాలా బాక్స్’











