మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. దేవ కట్టా రాసిన సంభాషణలు థియేటర్లో బాగా పేలాయి. అన్నివర్గాల వారు ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర దర్శకుడు దేవ కట్టాకు పవర్ స్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. సామాజిక సమస్యల్ని రాజకీయ కోణంలో ఆవిష్కరించిన తీరు.. ఆయన చర్చించిన రాజకీయ అంశాలు.. అందులో ఆయన సంధించిన పవర్ ఫుల్ సంభాషణలు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సైతం ఆకట్టుకున్నాయట. ఇటీవల రిపబ్లిక్ మూవీని చూసిన పవన్ .. తనకి కూడా ఓ మంచి స్టోరీ రెడీ చేయమని దేవ్ కట్టాకి చెప్పారని సమాచారం. పవన్ అలా అనడంతో వెంటనే దర్శకుడు దేవ్ కట్టా ఓకే చెప్పారని తెలిసింది.
పవర్ స్టార్ కి కథ సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారట దేవకట్టా. పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడంలో సిద్ధహస్తుడైన దేవ కట్టా దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ తో సినిమాలు తీసేందుకు హరీశ్ శంకర్, సురేంద్రరెడ్డి తదితర దర్శకులు రెడీ గా ఉన్నారు. అందుచేత దేవ్ కట్టా వంతు వచ్చేసరికి చాలా టైమ్ పడుతుంది. ఒక వేళ ఆయన స్ర్కిప్ట్ ఫాస్ట్ గా రెడీ చేసుకుని మెప్పిస్తే.. పవన్ వెంటనే స్టార్ట్ చేద్దామంటారేమో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ వ్యాఖ్యలపై వాడివేడిగా ఎదురుదాడులు











