ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట్లాడినదిగా చూపుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో మీడియా ముందు వీడియో ప్రదర్శించిన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు హాజరు కావాలని రెండు సార్లు నోటీసులు పంపినా దేవినేని హాజరుకాక పోవడంతో సీఐడీ అధికారులు నిన్న విజయవాడ సమీపంలోని గొల్లపూడిలోని దేవినేని నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు వెనుతిరిగారు. ఈ కేసులో సీఐడీ విచారణ నిలువరించాలని, అరెస్టులు ఆపాలంటూ దేవినేని ఉమ తరఫు న్యాయవాది ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం
మాజీ మంత్రి దేవినేనిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. అయితే ఐదు రోజులుగా దేవినేని క్వారంటైన్‌లో ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. ఆయన ఫోన్లో కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. అయితే దేవినేని కోసం సీఐడీ అధికారులు గాలిస్తున్నారు. ఆచూకీ లభిస్తే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- మాజీ మంత్రి దేవినేని అరెస్టుకు రంగం సిద్ధం?