‘వై దిస్ కొలవెరీ.. కొలవెరీ.. కొలవెరీ డీ..’ అనే పాటతో యావత్ భారతదేశాన్నే ఊపేశాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. ‘3’ అనే తమిళ సినిమాతో రంగ ప్రవేశం చేసిన ఆ కుర్రోడికి అదే మొదటి సినిమా. ఆ సినిమాలోదే ఆ పాట కూడా. ధనుష్ భార్య, రజనీకాంత్ చిన్నకూతురు అయిన ఐశ్వర్య ‘3’ సినిమాని తెరకెక్కించింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా పాట రేంజ్ లో ఆశించిన మేర సక్సెస్ సాధించలేకపోయింది.
మొదటి సినిమాలోని పాటతో.. బ్రహ్మాండమైన క్రేజ్ తెచ్చేసుకున్న అనిరుధ్. ఆ తర్వాత ధనుష్ నటించిన మూడు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. అయితే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ అద్భుతమైన కాంబో లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకుడు.
గతంలో ధనుష్ తో ‘యారడీ నీ మోగినీ, కుట్టి, ఉత్తమపుత్రన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని తీశాడు మిత్రన్. మళ్ళీ ఇన్నాళ్ళకు ధనుష్ తో మిత్రన్ జోడీ కట్టనుండడం కోలీవుడ్ లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యే లోపు .. ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని కోలీవుడ్ టాక్. మరి ధనుష్, మిత్రన్, అనిరుధ్ కలయిక ఈ సారి ఇంకెంత రేంజ్ లో పేలుతుందో చూడాలి.











