తమిళ హీరో ధనుష్, తమిళ కుట్టి సాయి పల్లవి కలిసి నటించిన మారి-2 సినిమాలోని రౌడీ బేబీ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిన విషయమే. అందులోని ధనుష్-సాయిపల్లవి, తమ డాన్స్ తో యువతకు కిర్రెక్కించారు. ఇంక ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ ఎంత ఊపునిస్తుందో మాటల్లో చెప్పలేం. ఈ పాట అంతలా ప్రతి ఒక్కరి చెవిలో మార్మోగిపోయింది. మరి అందరి చేత సూపర్ అనిపించుకున్న ఈ పాట తాజాగా మరొక మైలురాయిని అందుకుంది. రెండేళ్లు గడిచినా యువతను ఈ పాట ఎంతగా అలరిస్తుందంటే.. తాజాగా ఈ 100 కోట్ల (బిలియన్) వ్యూస్ మార్క్ ను అందుకుంటేనే తెలుస్తుంది.
‘కొలవరి డి’ కి 9 ఏళ్లు
రౌడీ బేబీ సాధించించిన ఈ ఘనతను హీరో ధనుష్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు, 2011 లో ‘3’ అనే సినిమా ద్వారా రిలీజ్ అయిన ‘కొలవరి డి’ అనే పాట కూడా యువతను ఉర్రూతలూగించింది. ఈ పాట విడుదలై 9 సంవత్సరాలు గడిచిన రోజునే… ‘రౌడీ బేబీ’ పాట ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉంటుందంటూ తెలియజేశారు ధనుష్.
రెండు పాటలను పాడిన ఘనత హీరోదే…
ఈ రెండు పాటలను హీరో ధనుష్ పాడడం మరో విశేషం. 9 ఏళ్ల క్రితం విడుదలైన కొలవరి డి, అప్పట్లోనే సంచలనాలను నమోదు చేసింది. 2018 లో విడుదలైన రౌడీ బేబీ అంతకు మించి అనిపించుకుంది. అంతేనా… 2019 చివరిలో యుట్యూబ్ సౌత్ ఇండియా టాప్ ఫ్యూస్ లిస్ట్ లో కూడా ఈ రౌడీదే అగ్రస్థానం. మరి 2020 చివరికి వస్తున్న ఈ సమయంలో తన రికార్డును నిలబెట్టుకుంటూ మళ్లీ సౌత్ ఇండియా టాప్ లిస్ట్ లో చేరిందీ రౌడీ బేబీ. మరి మీరు ఒకసారి ఈ పాటు చూసి.. విని.. ఎంజాయ్ చేయండి మరి…
Also Read ;-మళ్ళీ ధనుష్ – అనిరుధ్ కాంబో











