‘కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్’ లాంటి సూపర్ హిట్ సూపర్ హీరో చిత్రాల్ని తెరకెక్కించిన వరల్డ్స్ నెం.1 దర్శకులు రూసో బ్రదర్స్ .. రూపొందిస్తున్న సరికొత్త భారీ బడ్జెట్ సినిమా ‘ది గ్రేమేన్’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైది . ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న భారీ ఓరిజినల్ మూవీ ఇది. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ మూవీలో రియాన్ గోస్లింగ్ , క్రిస్ ఇవాన్స్ హీరోలుగా నటిస్తుండగా.. అనా డే ఆర్మస్, జెస్సీకా హెన్విక్, వాగ్నర్ మౌరా, జులియా బటర్స్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ రచయిత మార్క్ గ్రీనే రాసిన ‘గ్రేమేన్’ నవల ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 200 మిలియన్స్ డాలర్స్ తో నిర్మాణం జరుపుకుంటోంది ‘ది గ్రేమేన్’ సినిమా. గతంలో ధనుష్ ‘ది ఎక్స్ ట్రార్డినరీ జెర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంగ్లీష్ మూవీలో కూడా నటించాడు కానీ.. ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు మరోసారి అక్కడ హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధనుష్ మామగారు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా .. ‘బ్లడ్ స్టోన్’ అనే ఇంగ్లీష్ మూవీలో నటించారు. ఇప్పుడు అల్లుడు కూడా హాలీవుడ్ లో నటించనుండడం విశేషంగా మారింది. మరి ఈసినిమాతో ధనుష్ హాలీవుడ్ లో ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
Must Read ;- రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
Breaking: Director @Russo_Brothers has started filming for $200M budgeted Netflix’s biggest original film #TheGrayMan.
The film stars Ryan Gosling, Chris Evans, Dhanush, Ana de Armas, Jessica Henwick, Wagner Moura, Julia Butters and Regé-Jean Page. pic.twitter.com/Ou4V9ZxUKf
— LetsOTT GLOBAL (@LetsOTT) March 16, 2021