నటిగా పునర్నవి భూపాలం అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ 3 పునర్నవి అంటే మాత్రం అందరికీ తెలుసు. ఆ రియాలిటీ షో ద్వారా ఆమె అంత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత పున్ను ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతో చలాకీగా ఉంటూ తరచూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంది.
ప్రస్తుతం పునర్నవి పోస్ట్ చేసిన ఓ పోస్ట్ తో నెటిజన్లు కాస్త గందరగోళానికి గురి అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. పునర్నవి తన వేలికి ఉన్న ఉంగరం ఫొటోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘ఎట్టకేలకు ఇది జరగబోతుంది’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందని భావిస్తున్నారు.
దీని గురించి కొందరు నెటిజన్లు, స్నేహితులు ఆమెను ప్రశ్నించగా వాటికి ఆమె అక్టోబర్ 30న అన్ని విషయాలు చెబుతా అంటుంది. కొందరు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెప్పగా..మరి కొందరు మాత్రం ‘నిజమేనా, మేడమ్.. ఇది నిజంగా ఎంగేజ్ మెంట్ రింగేనా?’ లేక వర్క్ ప్రమోషన్ చేస్తున్నారా? ఇంతకీ మిమ్మల్ని పెళ్లాడబోయే వ్యక్తి ఎవరు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ స్నేహితురాలు ‘ఓ మై గాడ్.. నువ్వు నిజమే చెబుతున్నావా? ఎట్టకేలకు సీక్రెట్ బయటపెట్టావు. ఇంకొంచెం ఎక్కువ చెప్పు’ అని కామెంట్ పెట్టగా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండు అని పున్ను సమాధానం ఇచ్చింది. ఉయ్యాలా..జంపాలా చిత్రం ద్వారా పునర్నవి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.











