బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకి రాజకీయ ప్రచారాలు వేడెక్కుతున్నాయి. ఎవరికి వారే తమ ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ.. ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల మీద అంతగా ఫోకస్ పెట్టినట్లు అనిపించడం లేదు. అనిపించడం కాదు ఆ విషయం నిజమనే చెప్పాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ఒక్క బడా నేత కూడా రాలేదు. బుధవారం మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మంగళవారం నాడు కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ బిహార్ ప్రజలనుద్దేశించి మాట్లాడిన వీడియోను ఒక దానిని రాహుల్ గాంధీ తన ట్విటర్ లో ఉంచారు. ఈ మాత్రం ప్రచారం సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు భావించినట్లుగా అనిపిస్తుంది.
ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి మోదీ షెడ్యూల్ ఖరారు అయ్యింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బిహార్ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకోలేదు. తమిళనాడులో ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడ కనీీసం కాంగ్రెస్ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు బిహార్ లో కూడా కాంగ్రెస్ కు అదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
అసలు బిహార్ ఎన్నికల గురించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదు అనే దాని మీద పలు సందేహలు వస్తున్నాయి. దాదాపు బిహార్ లో అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మేమే గెలవాలి అన్న కసి మీద ఉన్నాయి. అదే విధంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి.
కానీ కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలను చాలా తేలికగా తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ‘కేవలం ట్విటర్ లో ఓ వీడియో పెట్టేస్తే చాలు ఓట్లు పడిపోతాయ్ అనుకుంటున్నారా మేడమ్?’ అంటూ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.
మరి వీటిని అన్నిటిని పరిగణనలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
‘बदलाव की बयार है।’
कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी का बिहार की जनता के नाम संदेश आपसे साझा कर रहा हूँ।
नए बिहार के लिए एकजुट होकर महागठबंधन को जीताने का समय है। pic.twitter.com/ptmzjEjQuh
— Rahul Gandhi (@RahulGandhi) October 27, 2020