బరువు తగ్గడం ఒకెత్తైతే.. పొట్ట తగ్గించుకోవడం ఒకెత్తు.. శరీరమంతా సన్నగా ఉంటుంది.. కానీ కొందరు పొట్ట పెరుగుతుంది. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బందిపడుతుంటారు. వ్యాయామాలు ఎన్ని చేసినా.. ఆహారసమతుల్యం లేనిదే అనుకున్న ఫలితాలు అందవు. ఇలాంటి పొట్ట సమస్యతో బాధపడేవారు వ్యాయామాన్ని పాటించడంతోపాటు.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే సరి. పొట్ట కొవ్వు ఇట్టే కరుగుతుందంటున్నారు నిపుణులు.
చక్కెరకు చెక్ పెట్టండి..
Must Read ;- ఈ ఆహారంతో ప్రణాళిక లేని గర్భధారణకు చెక్ పెట్టవచ్చు
ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువు చక్కెర. ఈ తీపి పదార్థాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే.. మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. చక్కెర మాత్రమే కాదు.. చక్కెరతో చేసిన పదార్థాలు వంటివి కూడా దూరంగా ఉంచాలంటున్నారు నిపుణులు. దీని వల్ల పొట్ట భాగమే కాదు.. శరీరంలోని చేతులు, పిరుదులు, తొడలు వంటి ప్రాంతాల్లోని కొవ్వును కూడా కరిగించడానికి ఈ ఆహార నియమం తొడ్పడుతుంది.
పిండిపదార్థాలు తగ్గించాలి..
పిండిపదార్థాలు అధికంగా అందించే రైస్, అటుకులు వంటి ఆహారాన్ని తగ్గించాలి. అన్నం తినాలనుకుంటే ఒక పూటకు మాత్రమే పరిమితం అయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి వేళ 7-8 గంటలలోగా సమయంలోగా ఆహారం ముగించాలి. ముఖ్యంగా రాత్రి ఆహారంలో అన్నం తీసుకోవడం మానుకోవాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే.. తక్కువగా తీసుకుని ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేట్లు ప్లాన్ చేసుకుంటే మంచిది.
Also Read ;- కొత్తరకం కరోనా వైరస్ లక్షణాలు ఏంటి? జాగ్రత్తలు, ఆహారం గురించి తెలుసుకోండి..
వీటిని ఎక్కువగా తీసుకోండి..
పొట్ట తగ్గించాలంటే తినడం పూర్తిగా తగ్గించాలని కాదు.. కాస్త ఎక్కువగా తినాల్సిన ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి. అన్నం శాతాన్ని తగ్గించి అందులోకి పప్పుకూరలు, తాజాగా ఉడికించిన కూరగాయలు, గడ్లు, సోయా నగ్గెట్స్, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు తృణధ్యానాలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నం బదులుగా గోధుమ రవ్వ, జొన్నలు, రాగులు.. వంటి వాటితో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. వీటి వల్ల పొట్ట తగ్గడంతో బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు, మీ ఎముకలకు బలం చేకూరుతుంది.
సరైన మోతాదులో ప్రొటీన్
ప్రొటీన్ కలిగిన ఆహారం శరీరానికి చాలా అవసరం. చికెన్, గుడ్లు, చేపలు, నట్స్.. వంటివి తగిన మోతాదులో ఆహారంలో తీసుకోవడం చాలా అవసరం. తగిన మోతాదులో ప్రొటీన్ ఆహారం శరీరానికి అందకపోతే.. శరీరం నీరసించి పోతుంది. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం వంటివి జరుగుతాయి. ప్రొటీన్ ఆహారం తగినంత తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మీరు ఆరోగ్యంగా ఉండడంతో పొట్టలోకి కొవ్వు భాగం కరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read ;- ముంచుకొస్తోంది.. ‘బర్డ్ ఫ్లూ’ ముప్పు! కోడి మాంసం తినవచ్చా?
పీచు పదార్థాలు..
శరీరంలోని వ్యర్థ పదార్థాలు సకాలంలో బయటకు వెళ్లడం చాలా అవసరం. అది మీ శరీరంలోని భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయి అనడానికి గుర్తు. అంతేకాదు.. బరువు, పొట్ట వంటివి అదుపులో ఉంటాలన్నా.. లేక తగ్గించుకోవాలన్నా.. జీర్ణవ్యవస్థ కరెక్ట్‌గా పనిచేస్తున్నప్పుడే సాధ్యమవుతుంది. మరి జీర్ణ ప్రక్రియ సరిగ్గా పనిచేయడానికి పీచు పదర్థాలు తోడ్పడుతాయి. అందుకోసం ఆకుకూరలు, బీన్స్, ఓట్స్, పండ్లు వంటివి మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
వ్యాయాపం తప్పని సరి..
ఆహారం మాత్రమే అదుపుచేసుకుంటూ ఉంటే అనుకున్న ఫలితాలు అందుకోవడం అసాధ్యం. ఆహారంతోపాటు.. వ్యాయామం చేసినపపుడే పొట్ట భాగాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన వ్యాయామాలు రోజుకు కనీసం 15 నిమిషాల పాటు చేయడం అలవాటుచేసుకోవాలి. ఈ వ్యాయామాల వల్ల పొట్ట భాగంలోని కొవ్వు కరగడంతోపాటు.. అక్కడి కండరాలు గట్టి పడతాయి.
ఇలా సమతుల ఆహారం.. సరైన వ్యాయామంతో పొట్టను తగ్గించుకోవచ్చు. ఇవి పాటించడానికి కష్టమైనవి కూడా కాదు. ప్రతిరోజూ పండ్లు మాత్రం తప్పకుండా మీ ఆహారంలో భాగం చేసుకోవడం మరచిపోవచ్చు. అలాగే వారంలో రెండు సార్లు ఆకుకూరలు తినండి. ఇక పొట్ట అనేది మీకు సమస్య కాదు.