సాధారణంగా పెళ్లి అంటే పెళ్లికొడుకు తాళి కట్టాలి, కానీ అక్కడ మాత్రం పెళ్లి కూతురు కూడా తాళి కట్టాల్సిందే అది అక్కడి ఆచారం. అంతేకాదు పెళ్లికొడుకు నల్ల కళ్ళజోడు పెట్టుకుని, మెడలో నోట్ల దండ వేసుకుంటేనే పెళ్లి జరుగుతుంది. అది ఆ ఊరి ఆచారం.అంతే కాదండోయ్ ఒకేరోజు ఓకే ముహూర్తానికి వందల పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇదెక్కడి వింత ఆచారం, ఈ తంతు ఎక్కడ జరుగుతోంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.
సహజంగా పెళ్ళిళ్ళు అంటే పెళ్లికొడుకు తాళి కట్టడం, పెళ్లికూతురు సిగ్గుతో తలాడించుకు కూర్చోవాడమే మనం చూస్తుంటాము. కానీ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మాత్రం అలా కాదంట. పెళ్ళిలో పెళ్లికూతురు కూడా పెళ్ళికోదుకుకి తాళి కట్టాల్సిందే. అప్పుడే వారిద్దరికీ పెళ్లి జరిగినట్టట.
నువ్వలరేవు లో ఇది ప్రతీ ఏటా జరిగే తంతే.ఇక్కడ జరిగే పెళ్ళిళ్ళు అంటేనే చుట్టుపక్కల భలే సరదాఅట. ఈ పెళ్లిళ్లకు పెద్దగా ఆరభయతు ఉండవు, మరి ముఖ్యంగా కట్నాలు అసలే ఉండవు. ఇకపోతే అక్కడ జరిగే పెళ్ళిళ్ళలో జరిగే విశేషాలు అన్నీ ఇన్నీ కాదు.
ప్రధానంగా నువ్వలరేవులో జరిగే పెళ్ళిళ్ళలో చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే..
* ఆ గ్రామంలో అమ్మాయిలను ఆ గ్రామానికి చెందిన అబ్బాయిలకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే బయటి ఊరు కుర్రాళ్లకు ఇవ్వరన్నమాట.
*నువ్వలరేవు గ్రామానికి చెందిన యువతీ యువకులు ఎక్కడ స్థిరపడినా పెళ్లి మాత్రం ఇక్కడి వారినే చేసుకోవాలి అనేది ఆనవాయితీ..
*పెళ్లికొడుకు తాళి కట్టిన తర్వాత, పెళ్లికూతురు కూడా పెళ్ళికొడుకుకి తాళి కట్టాలి.. అలా అయితేనే ఆ పెళ్లి జరిగినట్టు. ఇది ఆ గ్రామంలో వాళ్ళు అనాదిగా పాటిస్తున్న ఆచారం.
*ఇక మరి ముఖ్యంగా పెళ్లి సమయంలో పెళ్లికొడుకు మెడలో నోట్ల దండ వేసుకుని, నల్లకళ్ళజోడు పెట్టుకుంటేనే పీటలు ఎక్కనిస్తారు. ఇదీ ఒక ఆచారమేనట.
*ఓకే రోజు, ఓకే మూహర్తానికి ఆ గ్రామంలో వందల పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ ఊరి పెద్దలు మంచి ముహూర్తం నిర్ణయించి తేదీని ఫిక్స్ చేస్తారు. ఇక గ్రామ ప్రజలు సైతం ఊరి పెద్దల మాటకు కట్టుబడి అదే సమయానికి పెళ్ళిళ్ళు జరుపుకుంటారు. ఇది చాలా కాలం నుంచి గ్రామస్తులు పెట్టుకున్న ఆనవాయితీ.
*పెళ్ళికి ముందు రోజు గంగమ్మ అమ్మవారిని పెళ్లిచేసుకునే వారి ఇంటికి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించడం కూడా ఇక్కడి ఆచారం.
అంతేకాదండోయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వలరేవు పెళ్ళిళ్ళలో వింతలు చాలానే ఉన్నాయి.
నిజానికి వీరంతా 400 ఏళ్ళ క్రితం ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారట. కాగా దశాబ్దాలుగా నువ్వలరేవులో పెళ్ళిళ్ళు ఇలాగే జరుపుకుంటున్నారు. ఇక ఇక్కడ జరిగే ఈ వింత పెళ్లి వేడుకలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారట. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఇక్కడ పెళ్ళిళ్ళు ఆశించిన శతజాయిలో జరగనప్పటికీ, ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో ఈ ఏడు మాత్రం నువ్వలరేవులో పెళ్ళిళ్ళు యధావిధిగా జరిగాయట.
ఎండ్ వాయిస్ : మొత్తానికి వింత పెళ్లిళ్లకు నెలవుగా చెప్పుకునే నువ్వలరేవులో పెళ్ళిళ్ళు సజావుగా సాగడం పై అక్కడి ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం