నటసింహ నందమూరి బాలయ్య సినిమా అంటే.. పవర్ ఫుల్ డైలాగ్స్.. హై ఓల్టేజ్ ఎలివేషన్.. భారీ ఫైట్స్ .. దానికి తగ్గట్టుగా పాటలు. ఎలాంటి దర్శకుడైనా వీటిని ఫాలో అయి తీరాల్సిందే. ప్రస్తుతం బోయాపాటి తీస్తున్న అఖండ, దీని తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్న సినిమాలు .. ఇవే హైలైట్స్ గా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య తో చేయబోయే సినిమాకి ఈ ఫార్ములానే అప్లై చేస్తాడట.
నిజానికి అనిల్ రావిపూడి సినిమాల స్టైలే వేరు. మాస్ హీరోతో కూడా కామెడీ పండించి అభిమానుల్ని ఖుషీ చేసే ఈ దర్శకుడు.. ఇప్పుడు బాలకృష్ణ తో చేయబోయే సినిమాకి ఓ పవర్ ఫుల్ స్టోరీ వండుతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ కేరక్టరైజేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గా ఉంటుందట. ఈ సినిమా ఇంచుమించు పటాస్ సినిమాను పోలిన సీరియస్ స్టోరీతో .. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతోందట. గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అనిల్ రావిపూడి మూవీ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాలయ్యకి ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.