ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ లో బోయపాటి, బాలయ్య కలయికలో వస్తోన్న మూడో సినిమా ఒకటి. బీబీ3 గా వ్యహరిస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ లో ఉంది. ఇంకా పేరు పెట్టకుండానే.. మే 28న విడుదల తేదీని లాక్ చేయడంతో .. టైమ్ కి విడుదల చేయాలనే ఒత్తిడి ఒక పక్కనుండగా.. టైటిల్ ను ఇంకా ప్రకటించకుండా అభిమానుల్ని ఊరడించే ప్రయత్నం మరోపక్క సాగిస్తున్నాడు దర్శకుడు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో విషయంలో బోయపాటి అండ్ టీమ్ మరింత టెన్షన్ పడుతున్నారు. అదేంటంటే.. ఈ సినిమాలోని బాలయ్య నటించిన అఘోరా ఎసిసోడ్. దాదాపు పది నిమిషాల పాటు సాగే ఎపిసోడ్ అది. భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ ఔట్ పుట్ చూసిన బాలయ్యకి తృప్తి కలగక ఆ ఎపిసోడ్ ను వద్దని చెప్పారట. దాంతో బోయపాటి అప్పటికప్పుడు దాని స్థానంలో మరో పాత్ర రాసుకొని దానికి చిత్రీకరణ నే కూడా పూర్తి చేశాడట.
ఇప్పుడు ఎంతో కష్టపడి చిత్రీకరించిన అఘోరా ఎపిసోడ్ వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో బోయపాటి.. దాన్ని సినిమాలో వేరే రకంగా వినియోగించుకోవాలని అనుకుంటున్నారట. దీన్ని సినిమా అంతా పూర్తయ్యాకా ఎండ్ టైటిల్స్ స్థానంలో ప్లే చేస్తే.. అభిమానులు కూడా ఖుషీ అవుతారని బోయపాటి భావిస్తున్నాడట. మరి దీనికి బాలయ్య ఏమంటారో అనే టెన్షన్ తో బోయపాటి ఉన్నారని తెలుస్తోంది. మరి దానికి బాలయ్య ఒప్పుకుంటారో లేదో చూడాలి.
Must Read ;- బాలయ్య ‘గాడ్ ఫాదర్’ అనే ఫిక్సయ్యారట..!