ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె. కృష్ణమోహన్ రావు కన్ను మూశారు. ఈయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కు స్వయానా సోదరుడు. గత కొంత కాలంగా.. ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతోన్న ఆయన హైద్రాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ బుధవారం హైద్రబాద్ లో ఆయన తన స్వగృహంలో తుది శ్వాసవిడిచారు.
కృష్ణ మోహన్ రావు వయసు 81 సంవత్సరాలు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు.
Must Read ;- సీనియర్ నటుడు కాంతారావు భార్య కన్నుమూత