బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న నటి అనసూయ. ఆమె ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు రంగస్థలం సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో రంగమ్మత్తగా నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో అనసూయకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. అనసూయ ఓ ప్రయోగాత్మక పాత్ర పోషిస్తుందని టాక్ వచ్చింది. అది ఏంటంటే.. గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. తన కెరీర్ లో ఇది ఓ ఛాలెంజింగ్ రోల్ అని ఈ పాత్ర చేసేందుకు సైన్ చేసిందని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువవ్వడంతో నిజమే అనుకున్నారు.
ఆఖరికి ఈ వార్త మారుతి దృష్టికి వచ్చింది. దీంతో మారుతి ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. అసలు ఈ సినిమాలో వేశ్య పాత్ర లేదు. అనసూయ లాంటి ఆర్టిస్ట్ చేయదగ్గ పాత్ర ఉంది కానీ.. వేశ్య పాత్ర కాదు. ఓ పాత్రకు భార్య క్యారెక్టర్ అది. ఈ ప్రచారం ఎక్కువైందనే ఖండిస్తున్నాను అని మారుతి క్లారిటీ ఇచ్చారు. అదీ.. సంగతి. ఈ పక్కా కమర్షియల్ మూవీని త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది అంటూ రిలీజ్ డేట్ ను షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందుగానే ఎనౌన్స్ చేయడం విశేషం.
Must Read ;- పేలనున్న అనసూయ ఐటమ్ బాంబ్