మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్. ఈ చిత్రాన్ని మలినేని గోపీచంద్ తెరకెక్కించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే రమేష్ వర్మతో ఓ సినిమాని స్టార్ట్ చేసారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే.. రవితేజ యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో సినిమా చేయాలనుకున్నారు. మారుతి చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చింది. ఈ సినిమాని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించాలనుకుంది.
అంతా సెట్ అయ్యింది ఇక అఫిషియల్ గా ప్రకటించడమే ఆలస్యం అనుకుంటుంటే.. రెమ్యూనరేషన్ విషయంతో తేడాలొచ్చాయట. రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదని చెప్పాడట. అంతే.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రవితేజ కోసం రాసుకున్న ఈ కథను కాస్త మార్చి గోపీచంద్ తో సినిమా చేయాలనుకుంటున్నారట మారుతి. యు.వి. క్రియేషన్స్ ఎప్పటి నుంచో గోపీచంద్ తో సినిమా చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా సెట్ అయ్యిందని సమాచారం.
ఇందులో హీరో లాయర్. డబ్బు కోసం ఎలాంటి కేసు అయినా వాదిస్తుంటాడట. అందుకనే ఈ కథకు కరెక్ట్ గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో పక్కా కమర్షియల్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారట. ప్రతిరోజు పండగే సినిమాతో సక్సస్ సాధించిన మారుతి ఈ సినిమాతో సక్సస్ ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
Must Read ;- యాక్షన్ లవర్స్ కు ఖిలాడి గా ట్రీట్ ఇవ్వనున్న రవితేజ