చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ సినిమా రూపొందింది. నితిన్ – ప్రియా ప్రకాశ్ జంటగా నటించిన ఈ సినిమాలో, రకుల్ లాయర్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ – మాదాపూర్ లోని ‘ఎన్ కన్వెన్షన్లో జరిగింది.
ఈ సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ, ” ఇక్కడంతా చాలా సందడిగా ఉంది .. ఏమీ వినిపించడం లేదు .. ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది. చెక్ సినిమాకి కల్యాణి మాలిక్ అందించిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని నితిన్ అన్నాడు. ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను ఇప్పుడే స్టేజ్ పై ప్లే చేసినప్పుడు విన్నాను .. చాలా బాగుంది. కల్యాణ్ నిజంగానే చాలా బాగా చేశాడు. ఈ మధ్య కాలంలో జనాలను ఎక్కువగా థియేటర్స్ కి రప్పించడంలో సాంగ్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇందాక నేను విన్నది కూడా అలాంటి పాటగానే చెప్పుకోవాలి.
చంద్రశేఖర్ యేలేటి ఇంతకుముందు సినిమాలు చేసినప్పటికీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఆయన ఫంక్షన్ విషయంలో కొంచెం టెన్షన్ గా కనిపిస్తున్నాడుగానీ, సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ‘చెక్’ టీజర్ చూడగానే .. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని ఈ మధ్య కాలంలో నేను ఎదురుచూసిన సినిమా ఇది. మాస్ కి – క్లాస్ కి మధ్య ఉన్న గీతను ఈ సినిమా చెరిపేస్తుందని నేను నమ్ముతున్నాను. నితిన్ ఈ మధ్య చాలా విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా చేసిన ‘చెక్’ తప్పకుండా హిట్ కొడుతుందని నేను భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
Must Read ;-చెక్ తో నిజమైన నటన నేర్చుకున్నాను: నితిన్











