టాలీవుడ్ లో నటవారసులకి కొదవే లేదు. ఎందరో స్టార్ హీరోలు తమ వారసుల్ని హీరోగా పరిచయం చేసి.. వారి విజయాలకు మురిసిపోతున్నారు. ఈ లిస్ట్ లోకి మరో నట వారసుడు కూడా చేరుతున్నాడు. అతడు మరెవరో కాదు దగ్గుబాటి అభిరామ్. అంటే సురేష్ బాబు చిన్నకొడుకు, రానా తమ్ముడన్నమాట. నిజానికి అభిరామ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేయాలని రామానాయుడు అప్పట్లో అనుకొనేవారు. ఎందుకోగానీ అప్పుడు కుదరలేదు. అయితే ఎట్టకేలకు ఇన్నాళ్ళకి ఇప్పుడు అతడి డెబ్యూ కి సమయం ఆసన్నమైందని టాలీవుడ్ నుంచి సంకేతాలు అందుతున్నాయి.
ఇంతకీ అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా? రవిబాబు. ఒకప్పుడు టాలీవుడ్లో హాస్య చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఇవివి తనయుడు నరేష్ ను అల్లరి నరేశ్ ను చేసిన ఘనత దక్కించుకున్న రవిబాబు కే .. అభిరామ్ నూ హీరోగా చేసే బాధ్యత అప్పగించారు సురేశ్ బాబు. రవిబాబు చెప్పిన ఒక డిఫెరెంట్ స్టోరీ సురేశ్ బాబు ను బాగా ఇంప్రెస్ చేసిందట. సురేశ్ బాబుకి, రవిబాబు కి మధ్య మంచి రిలేషన్స్ ఉండడంతో .. దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం రవిబాబు మంచి కథను రెడీ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది.
Also Read : మలయాళ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ కొన్న దిల్ రాజు