Director Sriwass Next Movie With Hero Gopichand :
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఆతర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అయితే.. బాలయ్య కోసం డైరెక్టర్ శ్రీవాస్ ఓ కథ రెడీ చేశారు. బాలయ్యకు వినిపిస్తే.. వెంటనే ఓకే చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు గోపీచంద్ తో శ్రీవాస్ మూవీ అని అనౌన్స్ మెంట్ వచ్చింది. లక్ష్యం, లౌక్యం తరవాత… గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది.
గోపీచంద్ నటించే 30వ సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే..ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని ప్రకటించింది. ఇక అసలు విషయానికి వస్తే.. బాలయ్య కోసం రాసిన కథతోనే శ్రీవాస్ గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. బాలయ్యతో సినిమా చేయాలంటే మలినేని గోపీచంద్ తో చేస్తున్న సినిమా పూర్తవ్వాలి. ఆతర్వాత అనిల్ రావిపూడితో చేయనున్న సినిమా పూర్తవ్వాలి.
ఆతర్వాత శ్రీవాస్ తో సినిమా ఉంటుంది. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది. కాబట్టే ఈలోపు శ్రీవాస్ గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. అయితే.. బాలయ్య కోసం రాసుకున్న కథతోనే గోపీచంద్ తో సినిమా చేస్తున్నారా..? లేక బాలయ్య కోసం రాసుకున్న కథను అలాగే ఉంచి మరో కథతో గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడా అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ఆఖరి దశలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ’