టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. బన్నీ తదుపరి చిత్రాలపై ఓ రేంజ్ లో అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో ఉంటుందని, ఇంకా మురుగదాస్ తో కూడా సినిమా చేయబోతున్నాడని . ఇలా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు మరో పేరు కూడా వినిపిస్తోంది.
అదేంటంటే.. ఎర్లియర్ గా ‘మహర్షి’ సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇంతకు ముందు ఈ ఇద్దరి కలయికలో ‘ఎవడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అందులో బన్నీ కనిపించేది తక్కువే అయినా.. అతడి కేరక్టరే సినిమాకి బేస్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబో లో పూర్తి స్థాయి సినిమా రానుండడం విశేషంగా మారింది. రీసెంట్ గా అల్లు అర్జున్ కి వంశీ స్టోరీ నెరేట్ చేశాడని, బన్నీకి స్టోరీ నచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.