టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అందచందాలతో మాస్ ఆడియెన్స్ కి దగ్గర అవుతుంటే, మరోవైపున తన కమ్యూనీకేషన్ స్కిల్స్, యాటిట్యూడ్ తో టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ ని ఆకట్టుకుంటోంది. దీంతో టాలీవుడ్ లో ఉన్న కొందరు టాప్ డైరెక్టర్స్ తమ సినిమాల్లో హీరోయిన్‌గా ప్రైమ్ ఛాయస్ పూజాకే ఇస్తున్నారు.
సమంత పెళ్లి అయిపోయిన దగ్గర నుంచి త్రివిక్రమ్ పూజాతో ప్రేమలో పడిపోయాడు. అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురములో, పోయిరావలె హస్తినకు… ఇలా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా ఉండాల్సిందే.
త్రివిక్రమ్ తరువాత డైరెక్టర్ హరీశ్ శంకర్ పూజా మాయలో పడిపోయాడు. దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేశ్, పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న కొత్త సినిమాల్లో పూజానే హీరోయిన్ గా తీసుకున్నాడు హరీశ్ శంకర్.
ఇక ఇప్పుడు పూజా మ్యాజిక్ వైఫై రేంజిలోకి కొరటాల శివ, అనిల్ రావిపూడి వచ్చినట్లుగా తెలిసింది. ఈ ఇద్దరు డైరక్టర్లూ కూడా తమ అప్ కమింగ్ సినిమాల్లో పూజా హెగ్డేనే హీరోయిన్ తీసుకోవాలనుకుంటున్నారని కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.
డైరెక్టర్లతో పాటు హీరోలు కూడా పూజా హెగ్డే పై మనసు పారేసుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పటికే ఈ పాపతో రెండు సినిమాలు చేశాడు, మూడో సారి కూడా వీరి కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. యన్టీఆర్ కూడా మరోమారు ఈ పాప తో జతకట్టబోతున్నాడు. ఏమైనా కానీ పూజా హెగ్డే డేట్స్ కోసం ప్రస్తుతం టాలీవుడ్ దర్శకనిర్మాతలు పూజలు చేస్తున్నారన్నదైతే వాస్తవం.











